నీ ఉద్యోగులు మధ్యలో ఆపకుండా పూర్తి చేసే ఇంగ్లీష్ కోర్సు.

Tutoroతో ప్రతి ఉద్యోగికి సొంత AI ఇంగ్లీష్ టీచర్ తోడుంటుంది. పాఠాలు పర్సనల్ ట్యూటర్ దగ్గర నేర్చుకున్నంత నాణ్యంగా, రోజూ ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అనిపించేంత ఆసక్తిగా సాగుతాయి.

మొదలుపెట్టు

డెమో బుక్ చేసుకో

ఒక్కో ఉద్యోగికి నెలకు $9 నుంచే. ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు.

Tutoro ఎలా పనిచేస్తుంది · 2 నిమిషాలు

ఎలా పనిచేస్తుందో చూడు

వీడియో మూసేయి

  • కొత్త స్థాయి!

    A1 → A2

  • + 138 XP

    ఇప్పటివరకు ఇదే నీ బెస్ట్ రోజు

  • ముఖాముఖి పోటీలో విజయం

    రౌండ్లలో 3:1తో గెలుపు

  • ఈరోజు పనులన్నీ పూర్తి

    3 / 3

  • 30 రోజుల Streak

    ఒక్క రోజు కూడా మానలేదు

  • + 250 నాణేలు

    వారపు బోనస్

  • కొత్త స్థాయికి చేరావు!

    A2 → B1

  • లీగ్‌లో మొదటి స్థానం

    30 మందిలో 1వ స్థానం

  • కొత్త ట్యూటర్ అన్‌లాక్!

    Katie

  • ఒక్క తప్పూ లేదు!

    12లో 12 సమాధానాలూ సరైనవే

  • మాడ్యూల్ పూర్తి!

    ప్రయాణాలు

  • తొలి పూర్తి వాక్యం

    పైకి చెప్పావు

  • వరుసగా ఐదు పాఠాలు పూర్తి

    ఒకే విడతలో

  • కొత్త దుస్తులు అన్‌లాక్!

    5 000 ఖర్చు చేశావు

  • కొత్త స్థాయికి చేరావు!

    B1 → B2

  • స్పోకెన్ ఇంగ్లిష్ పరీక్షలో పాస్

    రెండో ప్రయత్నంలో

కంపెనీలు నమ్మే Tutoro

  • 500

    +

    కంపెనీలు

    Tutoroతో ఉద్యోగులకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాయి

  • 1M

    +

    ఉద్యోగులు

    రోజూ నేర్చుకుంటున్నారు

  • 87

    %

    యాప్ వాడుతున్నవారు

    90 రోజుల తర్వాత కూడా సాధన కొనసాగిస్తున్నారు

  • Northbeam

  • ALTAVIA

  • Quadra

  • helioworks

  • Verado

Tutoroతో నీ కంపెనీకి కలిగే ప్రయోజనాలు

ఫోన్‌లో రోజుకు 15 నిమిషాలు చాలు. క్లాసుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పనిలేదు. దీనితో నీ కంపెనీకి కలిగే ప్రయోజనాలు చూడు.

  • డీల్స్ కుదుర్చుకోవడానికి తోడయ్యే ఇంగ్లిష్

    మాటలు సరిగ్గా అర్థం కాక అంతర్జాతీయ డీల్ చేజారిందని 49% మంది అధికారులు చెబుతున్నారు. ట్యూటర్‌తో పోలిస్తే 50 రెట్ల వరకు తక్కువ ఖర్చుతో నీ ఉద్యోగుల ఇంగ్లీష్‌ను మెరుగుపరుస్తుంది Tutoro.

  • నీ ఉద్యోగులు మిస్ చేయని శిక్షణ

    టీచర్లతో నేర్చుకున్నప్పటికంటే AIతో ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం బాగా మెరుగైంది. Tutoro రోజూ సాధన చేసే అలవాటు పెంచుతుంది. ఆటల్లా సాగే పాఠాలతో 88% మంది ఉద్యోగులు మరింత ఆనందంగా నేర్చుకుంటారు.

  • ఉద్యోగుల నైపుణ్యాలు పెంచు. నియామక ఖర్చులు తగ్గించు.

    నేర్చుకోవడాన్ని ప్రోత్సహించే కంపెనీల్లో ఉద్యోగులు కొనసాగడం 57% ఎక్కువ. కంపెనీలోనే కొత్త బాధ్యతల్లోకి మారడం 23% ఎక్కువ. దాంతో నువ్వు బయటివాళ్లను నియమించుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.

ఇతర మార్గాలతో పోలిస్తే

Tutoro ఎందుకు మెరుగైన ఎంపిక?

ఉద్యోగులు తమకు వీలైనప్పుడు నేర్చుకోవచ్చు. నీకు నిర్వహణ పని తగ్గుతుంది, ఖర్చెంతో ముందే తెలుస్తుంది.

ప్లాన్, ఉద్యోగుల సంఖ్యను బట్టి ధర మారుతుంది

గ్రూప్ క్లాసులు

ప్రైవేట్ ట్యూటర్

Tutoro

  • ఒక్కో ఉద్యోగికి అయ్యే ఖర్చు

    నెలకు $180 నుంచి $320 వరకు

    గంటకు $40 నుంచి $120 వరకు

    నెలకు $9 నుంచి

  • నేర్చుకునే సమయాలు

    నిర్ణీత వేళల్లోనే క్లాసులు

    క్లాసులు ముందుగానే బుక్ చేసుకోవాలి

    ఎప్పుడు వీలైతే అప్పుడు నేర్చుకో, 15 నిమిషాలు దొరికినా చాలు

  • వ్యక్తిగత శిక్షణ, ప్రోత్సాహం

    అందరూ ఒకే వేగంతో నేర్చుకోవాలి, ఆటల్లాంటి యాక్టివిటీలు తక్కువ

    ఎంతవరకు నీకు తగ్గట్టు నేర్పిస్తారనేది ట్యూటర్‌ను బట్టి ఉంటుంది

    ప్రతి ఉద్యోగి స్థాయికి, లక్ష్యాలకు తగ్గట్టు మారే పాఠాలు. నేర్చుకోవాలనే ఆసక్తిని కొనసాగించే ఆటలు, సవాళ్లు

  • హెచ్‌ఆర్‌కు పురోగతి వివరాలు

    హాజరు నివేదికలు

    హెచ్‌ఆర్‌కు ఉద్యోగుల పురోగతి పెద్దగా తెలియదు

    ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే డ్యాష్‌బోర్డ్ + పురోగతి నివేదికలు

  • కంపెనీ అంతటికీ శిక్షణ

    గ్రూపులు పెరిగేకొద్దీ సమన్వయం కష్టమవుతుంది

    ఒక్కో ఉద్యోగి చేరే కొద్దీ ఖర్చూ నిర్వహణ పనీ పెరుగుతాయి

    ఉద్యోగులందరికీ నేర్చుకునే అవకాశం కల్పించడం సులభం

ఇలా మొదలుపెట్టు

ఇలా పనిచేస్తుంది

నేరుగా లైసెన్స్‌లు కొని, ఉద్యోగులను ఆహ్వానించు. అదే రోజు మధ్యాహ్నానికే అందరూ సాధన మొదలుపెట్టొచ్చు.

  • ఎంతమంది నేర్చుకుంటారో ఎంచుకో

    ఎంతమంది ఉద్యోగులకు, ఎంతకాలం సబ్‌స్క్రిప్షన్ కావాలో ఎంచుకో.

  • ఉద్యోగులను ఆహ్వానించు

    ఈమెయిల్ చిరునామాల జాబితాను పేస్ట్ చెయ్యి లేదా చేరేందుకు అందరికీ ఒకే లింక్ పంపు.

  • వాళ్లు మాట్లాడటం మొదలుపెడతారు

    ఉద్యోగులు లింక్‌ను ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు, మొదటి పాఠం మొదలవుతుంది.

  • వాళ్ల పురోగతిని చూడు

    Streak, వారంలో చేసిన సాధన, ఇంగ్లీష్ స్థాయిలో మెరుగుదల అన్నీ ఒకే స్క్రీన్‌లో చూడు.

నిరంతర అభ్యాసం

ఉద్యోగులు నేర్చుకోవడం మధ్యలో ఎందుకు ఆపరు?

  • నిజమైన క్లాస్‌లాగే, మాట్లాడుతూ నేర్చుకో

    నువ్వు మాట్లాడు. నీ టీచర్ బదులిస్తూ, వివరిస్తూ, మధ్యమధ్యలో ప్రాక్టీస్ కూడా చేయిస్తారు.

  • ఏ సందర్భానికైనా సాధన చేయి

    ఉద్యోగ ఇంటర్వ్యూలో మాట్లాడటం, డాక్టర్‌తో మాట్లాడటం ప్రాక్టీస్ చెయ్యి, సాహస కథలోకి అడుగుపెట్టు లేదా నీ సొంత సన్నివేశాన్ని రాసుకో.

  • ఎవరితో మాట్లాడాలో నువ్వే ఎంచుకో

    ఒక్కో టీచర్‌ది ఒక్కో యాస, ఒక్కో తీరు. నువ్వు హాయిగా మాట్లాడగలిగే టీచర్‌ని ఎంచుకో.

  • ఏం మెరుగుపరచుకోవాలో తెలుసుకో

    ప్రతి పాఠం తర్వాత నీ స్కోర్లు చూసుకో. ఏ తప్పులు మళ్లీ మళ్లీ చేస్తున్నావో తెలుసుకో.

  • నేర్చుకున్న పదాలు గుర్తుండిపోతాయి

    నువ్వు మరిచిపోయేలోపే ఆ పదాలు చిన్న చిన్న ఆటల్లో మళ్లీ వస్తాయి, బాగా గుర్తుండిపోయే వరకు.

  • ఫీడ్ కాదు, నేర్చుకునే దారి

    ప్రతి పాఠంతో మ్యాప్‌లో ముందుకు సాగు. ఒక ప్రపంచాన్ని పూర్తి చేస్తే తర్వాతి ప్రపంచం తెరుచుకుంటుంది.

  • నీ లెవెల్ పెంచుకో. నిజంగానే!

    నీ పాత్రను సృష్టించుకో. నువ్వు పూర్తి చేసే ప్రతి పాఠంతో అది స్థాయి పెంచుకుంటూ పై లీగ్‌లకు చేరుకుంటుంది.

హెచ్‌ఆర్‌ కోసం

ఉద్యోగులు వాడుతున్నారో లేదో ఇక ఊహించక్కర్లేదు

ఎవరు సాధన చేస్తున్నారు, ఎంత మెరుగయ్యారు, ఎవరి ఇంగ్లీష్ ఏ స్థాయిలో ఉంది అనేది ఒకే డ్యాష్‌బోర్డ్‌లో చూడు. వివరాల కోసం ఒక్కొక్కరినీ అడుగుతూ ఉండాల్సిన పనిలేదు.

ఉద్యోగుల యాప్ వినియోగం

గత 30 రోజులు · నమూనా డేటా

  • వాడుకలో ఉన్న లైసెన్స్‌లు

    కొన్న లైసెన్స్‌లలో ప్రతి వారం ఎన్నింటిని ఉద్యోగులు వాడుతున్నారో చూడు

  • ప్రతి ఉద్యోగికి ఇంగ్లిష్ ఎంతవరకు వచ్చో తెలుసుకో

    CEFR ప్రకారం A1 నుంచి C1 వరకు వారి స్థాయిని చూపిస్తుంది. నేర్చుకునే కొద్దీ అప్‌డేట్ చేస్తుంది.

  • ఒక్కో ఉద్యోగి సాధన వివరాలు

    వారంలో సాధన చేసిన నిమిషాలు, పూర్తిచేసిన పాఠాలు, Streak

  • ఫైనాన్స్ విభాగం ఎప్పుడు అడిగినా రిపోర్టులు సిద్ధం

    స్క్రీన్‌పై కనిపించే డేటానే CSVగా డౌన్‌లోడ్ చేసుకో.

Tutoro ఎవరికి బాగా సరిపోతుంది?

ఇంగ్లీష్ కాస్త మెరుగైతే రోజువారీ పని మరింత సులువయ్యే ఉద్యోగాల్లో ఉన్నవారి కోసం.

మొదలుపెట్టు

  • కస్టమర్ సపోర్ట్ బృందాలు

  • అమ్మకాలు

  • ఇంజినీరింగ్

  • హోటళ్లు, రెస్టారెంట్లు

  • రిటైల్ వ్యాపారం

  • వైద్య సేవలు

  • మార్కెటింగ్

విజయగాథలు

మూడు కంపెనీల్లో వచ్చిన మార్పు

  • ఇంతకుముందు ఉద్యోగుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తిని కొనసాగించడం కష్టంగా ఉండేది. Tutoro వచ్చాక ఇష్టంగా నేర్చుకుంటున్నారు, మధ్యలో మానేయడం లేదు. కంపెనీ తమకు ఇచ్చిన ఉపయోగకరమైన సదుపాయంగా దీన్ని చూస్తున్నారు. ఉద్యోగుల సంతృప్తి కూడా పెరిగింది.

    హెచ్‌ఆర్‌ హెడ్

    Northbeam

  • మా సపోర్ట్ సిబ్బంది ఇప్పుడు విదేశీ కస్టమర్లతో మరింత నమ్మకంగా మాట్లాడుతున్నారు. సమస్యలను పైవాళ్లకు అప్పగించే అవసరం తగ్గింది. స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు, సొంతంగా పరిష్కరించగలుగుతున్నారు. కస్టమర్లకు కూడా మెరుగైన సేవ అందుతోంది.

    కస్టమర్ సపోర్ట్ బృందం అధిపతి

    Altavia

  • శిక్షణకు పెడుతున్న ఖర్చుతో ఏం సాధిస్తున్నామో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు నేర్చుకుంటున్నారు, ఎంత మెరుగుపడ్డారు, ఇంకా ఏ నైపుణ్యాలు పెంచుకోవాలి అనేది Tutoro గణాంకాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవ డేటాను చూసి నిర్ణయాలు తీసుకుంటున్నాం.

    చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్

    Helioworks

ధరలు

ఒక్కో ఉద్యోగికి నెలకు $9 నుంచి

ఎంతమంది ఉద్యోగులు నేర్చుకుంటారు?

ఒకే తగ్గింపు ధరతో నీ ఉద్యోగులందరికీ ఇంగ్లీష్ నేర్పించు.

ఒక్కో ఉద్యోగికి నెలకు

గ్రూప్ క్లాసులకు అయ్యే ఖర్చు

ప్రైవేట్ ట్యూటర్‌తో నేర్చుకోవడానికి అయ్యే ఖర్చు

కలిసి లెక్క చూసుకుందాం

నేర్చుకునేవాళ్లు 1,000 మందికి మించి ఉంటే, నీ కంపెనీకి ప్రత్యేక ధర ఇస్తాం. సీట్ల సంఖ్యను బట్టి తగ్గింపు, ఇన్వాయిస్‌తో చెల్లించే సదుపాయం ఉంటాయి. మా సేల్స్ బృందం నీతో కలిసి ఖర్చు లెక్కిస్తుంది.

డెమో బుక్ చేసుకో

సబ్‌స్క్రిప్షన్ వ్యవధి

నేర్చుకునేవారు

Tutoro, నీ ప్లాన్

ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు

ఎంతమంది ఉద్యోగులు నేర్చుకుంటారు?

ఒకే తగ్గింపు ధరకు నీ ఉద్యోగులందరూ సరదాగా నేర్చుకుంటూ ముందుకు సాగే అవకాశం ఇవ్వు.

తరచూ అడిగే ప్రశ్నలు

  • మా కంపెనీలో Tutoro వాడటం ఎలా మొదలుపెట్టాలి?

    నీ కంపెనీ ఖాతా తెరిచి, ఎంతమంది ఉద్యోగులకు కావాలో ఎంచుకుని, వాళ్లకు ఆహ్వానాలు పంపు. ప్రతి ఒక్కరికీ వాళ్ల స్థాయి, లక్ష్యాలకు సరిపోయే ఇంగ్లీష్ పాఠాలు అందుతాయి. ముందు Tutoro ఎలా పనిచేస్తుందో చూడాలనుందా? డెమో బుక్ చేసుకో.

  • Tutoro ధర ఎంత? ఎలా చెల్లించాలి?

    Tutoro ధర ఒక్కో ఉద్యోగికి నెలకు కేవలం $9 నుంచి మొదలవుతుంది. కనీసం 5 మందికి తీసుకోవాలి. కార్డుతో చెల్లించు లేదా నీ కంపెనీ డ్యాష్‌బోర్డ్ నుంచే ఇన్వాయిస్ తయారు చేసుకో.

  • ఒక ఉద్యోగి లైసెన్స్‌ను మరో ఉద్యోగికి ఇవ్వొచ్చా?

    ఉద్యోగి కంపెనీని వదిలి వెళ్లినా, ఇక Tutoro అవసరం లేకపోయినా ఆ సీటును మరొకరికి ఇవ్వొచ్చు. ఉద్యోగులు మారిన ప్రతిసారీ కొత్త సీటు కొనాల్సిన అవసరం లేదు.

  • ఎప్పుడైనా సీట్ల సంఖ్య పెంచుకోవచ్చా లేదా తగ్గించుకోవచ్చా?

    నీ అవసరాన్ని బట్టి సీట్లను పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. కనీసం 5 సీట్లు మాత్రం ఉండాలి. చెల్లింపులో మార్పులు నీ సబ్‌స్క్రిప్షన్ నిబంధనలను బట్టి ఉంటాయి.

  • Tutoroతో ఉద్యోగులు ఏమేం నేర్చుకుంటారు?

    ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సినవన్నీ Tutoroలోనే ఉన్నాయి. AI ట్యూటర్‌తో పాఠాలు, మాట్లాడే సాధన, విని అర్థం చేసుకోవడం, చదవడం, సరదాగా సాధన చేసే వ్యాయామాలు. నీ ఉచ్చారణను కూడా చెక్ చేసి, ఏం బాగా చేస్తున్నావో, ఏం సరిచేసుకోవాలో వెంటనే చెబుతుంది. అన్నీ ఒకే యాప్‌లో.

  • ఒక్కొక్కరి ఇంగ్లీష్ స్థాయికి తగ్గట్టు Tutoro నేర్పిస్తుందా?

    అవును. ప్రతి ఉద్యోగికీ తన స్థాయి, లక్ష్యాలకు తగ్గట్టు నేర్చుకునే ప్రణాళిక ఉంటుంది. ఆటల్లా సాగే వ్యాయామాలు ఆసక్తిని నిలిపి ఉంచుతాయి.

  • ఉద్యోగులు రోజూ ఎంత సమయం కేటాయించాలి?

    ఒక్కోసారి 15 నిమిషాలు దొరికినా నేర్చుకోవచ్చు. ఉద్యోగులు తమకు వీలున్నప్పుడే సాధన చేయొచ్చు. క్లాసులకు నిర్ణీత సమయాలూ లేవు, ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు.

  • ఉద్యోగులు ఉత్సాహంగా నేర్చుకునేలా Tutoro ఎలా చేస్తుంది?

    Tutoroలో ప్రతి ఉద్యోగికి తన స్థాయికి సరిపోయే పాఠాలు, ఆటల్లాంటి సవాళ్లు, బహుమతులు, చురుగ్గా పాల్గొనేలా చేసే వ్యాయామాలు ఉంటాయి. అందుకే రోజూ నేర్చుకోవాలనిపిస్తుంది, క్రమంగా అదొక అలవాటవుతుంది.

  • ప్రతి ఉద్యోగి ఎంతవరకు నేర్చుకున్నారో HR చూడగలదా?

    అవును. నీ కంపెనీ డ్యాష్‌బోర్డ్‌లో ప్రతి ఉద్యోగి ఎంత తరచుగా నేర్చుకుంటున్నారు, ఎంత మెరుగయ్యారు అనేది చూడొచ్చు. ఎవరు సాధన చేస్తున్నారు, ఉద్యోగులంతా ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది హెచ్‌ఆర్‌కు సులభంగా తెలుస్తుంది.

  • ఉద్యోగులకు కంపెనీ ఈమెయిల్ ఉండాలా?

    అవసరం లేదు. ఆహ్వాన కోడ్‌కు కంపెనీ ఈమెయిల్‌తో సంబంధం లేదు. ఆ కోడ్‌ను ఎవరు వాడితే సీటు వాళ్లకే వస్తుంది. ఉద్యోగి ఇప్పటికే వ్యక్తిగత ఖాతాతో Tutoro వాడుతుంటే, అదే ఖాతాకు సీటు జత అవుతుంది. తన Streak, లీగ్, నేర్చుకున్న పదాల జాబితా అన్నీ అలాగే ఉంటాయి.

  • చేరడానికి కనీసం ఎంతమంది ఉద్యోగులు ఉండాలి?

    కేవలం 5 మంది ఉద్యోగులతో Tutoro మొదలుపెట్టొచ్చు. చిన్న కంపెనీలకైనా, ఎదుగుతున్న సంస్థలకైనా సులభంగా అందుబాటులో ఉంటుంది.

రోజూ సాధన. కనిపించే ఫలితాలు.

నీ ఉద్యోగులకు ఇంగ్లీష్ నేర్చుకునే మెరుగైన మార్గాన్ని అందించు. ఒక్కొక్కరి అవసరాలకు సరిపోయే ఆసక్తికరమైన పాఠాలను పని రోజులోనూ సులభంగా పూర్తి చేయొచ్చు.

మొదలుపెట్టు

డెమో బుక్ చేసుకో